: మహారాష్ట్ర, హర్యానాల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ: ఒపీనియన్ పోల్ సర్వే


అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానాల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుందని శుక్రవారం వెల్లడైన ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ, సీ ఓటర్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ మేరకు తెలిపింది. 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 132-142 సీట్లను సాధించనున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. 50-60 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవనుందట. మరోవైపు 90 సీట్లున్న హర్యానాలో 34 సీట్లలో బీజేపీ విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 16 సీట్లు మాత్రమే దక్కనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ, అధికారం చేపట్టేందుకు సరిపడ మెజార్టీ స్థానాలను మాత్రం సాధించలేదని ఆ సర్వే వెల్లడించింది. అయితే మెజార్టీకి అతి చేరువలోకి మాత్రం వచ్చి నిలుస్తుందట.

  • Loading...

More Telugu News