: ఫేస్ బుక్ ‘క్లీన్ ఇండియా’ యాప్!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ పథకంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ఫేస్ బుక్ తన వంతు సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘క్లీన్ ఇండియా’ పేరిట మొబైల్ యాప్ రూపకల్పనలో ప్రభుత్వానికి సహకరించనున్నట్లు ఫేస్ బుస్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ ప్రకటించారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం అంశాలపై ఈ యాప్ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.