: భారత్ లోని వందలాది సమస్యలకు లక్షలాది పరిష్కారాలున్నాయి!: సత్యార్థి
నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన కైలాష్ సత్యార్థి సమస్యల పరిష్కారంపై సూటిగా స్పందిస్తారు. భారత్ సమస్యల నిలయం అని నిత్యం భావించే వారికి ఆయన సమాధానాలు గుణపాఠంలానే తోస్తాయని చెప్పొచ్చు. భారత్ లో సమస్యలు ఉన్నాయని చెప్పే సత్యార్థి, వాటి పరిష్కారాలు కూడా ఇక్కడే ఉన్నాయని చెబుతారు. భారత్ లోని వందలాది సమస్యలకు లక్షలాది పరిష్కారాలు కళ్లముందే కనిపిస్తాయన్నారు. నిత్యం ఎదురవుతున్న సమస్యలపై మనం చూపే దృక్పథమే, వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపుతుందని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తారు. నోబెల్ బహుమతికి ఎంపికైన సందర్భాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారన్న మీడియా ప్రశ్నలకు ‘‘శాంపేన్ తో మాత్రం కాదు. పిల్లలొస్తున్నారు. వారితోనే నా సంతోషాన్ని పంచుకుంటాను’’ అని ఆయన చెప్పారు.