: గాంధీజీకి వచ్చి ఉంటే ఇంకా సంతోషించే వాడిని: నోబెల్ విజేత సత్యార్థి


తనకంటే ముందు గాంధీజీకి నోబెల్ పురస్కారం వచ్చి ఉంటే మరింత సంతోషంగా స్వీకరించేవాడినని 2014 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, అన్ని విధాలా అర్హత కలిగిన గాంధీజీకి ముందుగా వచ్చే ఉంటే మరింత సంతోషించేవాడినని పేర్కొన్నారు. తనకు పురస్కారం ప్రకటించిన నోబెల్ కమిటీకి కృతజ్ఞతలని ఆయన తెలిపారు. 'ఇదో గొప్ప గౌరవం అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడి'నని ఆయన వివరించారు. 'ఈ అవార్డ్ దేశానికి అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తా'నని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News