: 37 రైళ్లు రద్దు, 31 రైళ్లు దారి మళ్లింపు
హుదూద్ తుపాన్ విశాఖ వైపుగా ముంచుకొస్తుండడంతో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. దీంతో ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈస్ట్ కోస్ట్ పరిధిలో 37 రైలు సర్వీసులను రద్దు చేయగా, మరో 31 రైలు సర్వీసులను దారి మళ్లించారు. ఈ నెల 11, 12 తేదీల్లో బెంగళూరు-భువనేశ్వర్- ప్రశాంతి ఎక్స్ప్రెస్ను, 12వ తేదీ బెంగళూరు-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.