: 4500 రేషన్ కార్డులు అప్పగించేస్తామంటున్నారు
నకిలీ రేషన్ కార్డుల కుంభకోణం మరో మలుపు తిరిగింది. కృష్ణా జిల్లా గుడివాలో నకిలీ రేషన్ కార్డుల కుంభకోణంతో సంబంధమున్న 46 మంది రేషన్ డీలర్లు 4500 రేషన్ కార్డులు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. గుడివాడ ఆర్డీవో అంగీకరిస్తే అతనికి నకిలీ రేషన్ కార్డులు అప్పగించనున్నారు. కాగా, నకిలీ రేషన్ కార్డుల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోంది.