: 193 బోట్లు, 4 యుద్ధనౌకలు, 6 హెలికాప్టర్లు సిద్ధం!


హుదూద్ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. విశాఖకు 350 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుపానును ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. పురాతన కట్టడాల్లో ఎవరూ నివాసం ఉండొద్దని కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రానికి 5 కిలోమీటర్లలోపు ఉండే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేపట్టారు. కేంద్రం నుంచి విశాఖకు 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలివెళ్లాయి. ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా 193 బోట్లు, 4 యుద్ధనౌకలు, 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించిన అధికారులు, మరిన్ని రైళ్లను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News