: నేను రెడీ... కేటీఆర్, నువ్వు రెడీయా?: షబ్బీర్ అలీ సవాలు
విద్యుత్ సమస్యపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉప నేత షబ్బీర్ అలీ సవాలు విసిరారు. భరోసాయాత్రలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ లోటు ఉందని తెలిసీ 8 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా పేర్కొన్నారని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇది రైతులను మోసం చేయడం కాదా? అని ఆయన నిలదీశారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు విద్యుత్ సరఫరా చేయలేనందువల్ల కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర మొదలు పెట్టడంతో సీఎం కేసీఆర్ విద్యుత్ కావాలంటూ ఉన్నపళంగా ఢీల్లీ పరుగెత్తారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల పంట నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.