: హైదరాబాదులో అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆచూకీ లభ్యం


హైదరాబాదులోని కేపీహెచ్ బీలో అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైంది. ఆమె క్షేమంగానే ఉన్నట్టు కూకట్ పల్లి పోలీసుల ద్వారా తెలిసింది. అయితే, ఆమె ఎక్కడ ఉన్నదనే విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. ఆమె కనిపించడం లేదంటూ భర్త కార్తీక్ చైతన్య నిన్న (గురువారం) అర్ధరాత్రి ఫిర్యాదు చేశాడు. దాంతో వెంటనే మాదాపూర్ పోలీసులు కొన్ని బృందాలతో కలసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ క్రమంలో భవ్యశ్రీని హైదరాబాదు తీసుకువచ్చి అధికారికంగా మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు భవ్యశ్రీ కుటుంబసభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News