: కేసీఆర్ కు ధైర్యంలేదని మరోసారి రుజువైంది: లోకేష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నారా లోకేష్ విమర్శల పరంపర కొనసాగుతోంది. తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చకు రాగల ధైర్యం కేసీఆర్ కు ఉందా? అంటూ సవాలు విసిరిన లోకేష్, ఆయనకు ధైర్యంలేదని రుజువైందని తాజాగా అన్నారు. తాను సవాలు చేస్తే ఆయన రాకుండా సమయం వృధా చేసేందుకు మంత్రులతో మాట్లాడిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవాస్తవాలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.