: ఫేస్ బుక్ లో నేను పెట్టిన వీడియో చూడండి: సచిన్


ప్రధాని మోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాని పిలుపు అందుకుని చీపురు పట్టి, బాంద్రా బస్టాండ్ ను శుభ్రం చేసిన సచిన్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. శుభ్రం చేయాల్సిన ప్రాంతానికి ఉదయానికల్లా చేరుకున్నామని, రెండు గంటల పాటు శ్రమించి కొద్దిమేర మాత్రమే శుభ్రం చేయగలిగామని తెలిపాడు. తర్వాత అక్కడి గోడలకు రంగులేశామని చెప్పాడు. ఈ కార్యక్రమం సందర్భంగా తమకు మునిసిపల్ అధికారులు, పోలీసులు సహకరించారని తెలిపాడు. కాగా, ఈ కార్యక్రమంపై తాను ఓ వీడియోను ఫేస్ బుక్ లో ఉంచానని, దాన్ని అందరూ చూడాలని పిలుపునిచ్చాడు సచిన్. అంతేగాకుండా, వెటరన్ పేసర్ జహీర్ ఖాన్, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, హాకీ స్టార్ సర్దారా సింద్ తదితరులను స్వచ్ఛ భారత్ కు నామినేట్ చేశాడు. ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో చేపడతానని సచిన్ ఈ సందర్భంగా తెలిపాడు.

  • Loading...

More Telugu News