: చంద్రబాబును కొరివిదయ్యంతో పోల్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొరివిదయ్యంతో పోల్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు కొరివిదయ్యంలా తయారయ్యారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. పీపీఏలను రద్దు చేసింది బాబేనని, అబద్ధాలతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను త్వరలోనే బట్టబయలు చేస్తామని వ్యాఖ్యానించారు. బొగ్గు గనులు తెలంగాణలో ఉంటే రాయలసీమలో థర్మల్ ప్లాంట్లు ఎలా నిర్మిస్తారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.