: జాతీయ గీతాన్ని గౌరవించని వ్యక్తిని బయటికి నెట్టేసిన ప్రీతీ జింటా!


బాలీవుడ్ తార ప్రీతీ జింటా మరోసారి వార్తల్లో కెక్కింది. ఇటీవలే నెస్ వాడియాతో వివాదం కారణంగా హాట్ టాపిక్ గా మారిన ఈ సొట్టబొగ్గల సుందరి, తాజాగా, జాతీయ గీతాన్ని గౌరవించని ఓ వ్యక్తిని సినిమా థియేటర్ నుంచి బయటికి నెట్టేసింది. ముంబయిలోని ఓ సినిమా హాల్లో 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్ర ప్రదర్శన సందర్భంగా జాతీయ గీతం వస్తుండగా, సదరు వ్యక్తి పైకి లేచేందుకు నిరాకరించాడు. జాతీయ గీతానికి అది అవమానకరమని భావించిన ప్రీతి అతడిని హాల్లోంచి బలవంతంగా బయటికి పంపించి వేసిందట. అభిమానులు ప్రీతి దేశభక్తిని హర్షిస్తుండగా, ట్విట్టర్లో మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది. బహిరంగ ప్రదేశంలో గూండాయిజం చేసిందన్న నేరం కింద ఆ నటిపై కేసు పెట్టాలని ఎక్కువ మంది డిమాండ్ చేశారు. అతి దేశభక్తి పొంగిపొర్లుతున్నందున ఆమె బీజేపీలో చేరితే బాగుంటుందని మరికొందరు సెటైర్లు విసిరారు. దీనిపై ప్రీతి స్పందిస్తూ, ఈ వ్యవహారంలో తన పాత్రేమీ లేదని, థియేటర్లో ఉన్న ఇతర ప్రేక్షకులే అతడిని బయటికి వెళ్ళాలని సూచించారని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News