: దక్షిణ ఢిల్లీలో గ్యాస్ పేలుడు... ఆరుగురు మృతి
దక్షిణ ఢిల్లీ జసోలాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మహిళతో పాటు ముగ్గురు చిన్నారులు, మరో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.