: మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా సునీతాలక్ష్మారెడ్డి
మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఇటీవల జరిగిన మెదక్ ఉప ఎన్నికలో సునీతాలక్ష్మారెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.