: ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు
వరంగల్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మేకా రాజు అలియాస్ మురళి, మిదియం సోమిది అలియాస్ సంగీత జిల్లా ఎస్పీ కాళిదాసు ఎదుట లొంగిపోయారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో జవాన్లపై ఇటీవల జరిగిన మావోల దాడిలో మురళి కీలక సూత్రధారుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు వదులుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ కాళిదాసు వెల్లడించారు.