: నారా లోకేశ్ సవాల్ ను స్వీకరిస్తున్నాం: టీఆర్ఎస్


తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారన్న అంశంపై చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్ కు దమ్ముందా? అంటూ టీడీపీ యువనేత నారా లోకేష్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అయితే, చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్ మాత్రమే అక్కర్లేదని... టీఎస్ ప్రభుత్వంలోని మంత్రులంతా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. పూర్తి అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు చేస్తున్నది రైతు భరోసా యాత్ర కాదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అవినీతిపై విచారణ పూర్తయితే... వారిని ఉంచడానికి తెలంగాణలోని జైళ్లు సరిపోవని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News