: ఇంట్లో రాజకీయవేత్తలు ఉన్నా... రాజకీయాలకు దూరంగానే ఉన్నా: భూమా అఖిల


తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని... ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థి భూమా అఖిలప్రియ (భూమా దంపతుల కుమార్తె) తెలిపారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని... వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమని తెలిపారు. అమ్మలేని లోటు తీర్చలేనిదని అన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదని... అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని ఊహించలేదని తెలిపారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News