: యూనిసెఫ్ దక్షిణాసియా అంబాసిడర్ గా ఆమీర్ ఖాన్ నియామకం


బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ను యూనిసెఫ్ తన దక్షిణాసియా అంబాసిడర్ గా నియమించుకుంది. దక్షిణాసియాలో బాలల పోషకాహారంపై ఆమీర్ ఖాన్ దృష్టి సారించనున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో యూనిసెఫ్ వెల్లడించింది. దక్షిణాసియాలో నెలకొన్న పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో ఆమీర్ సఫలీకృతులు అవుతారన్న దాంట్లో తమకు ఎలాంటి సందేహం లేదని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘‘యూనిసెఫ్ నియామకాన్ని గౌరవంగా భావిస్తున్నాను. పిల్లలకు పోషకాహారాన్ని అందించే దిశగా దక్షిణాసియాలోని అన్ని వర్గాల కుటుంబాలను మేల్కొలిపే దిశగా చర్యలు చేపడతాను. తద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అని ఆమీర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News