: ఇంజినీరింగ్ రెండోదశ కౌన్సెలింగ్ పై విచారణ వాయిదా


ఇంజినీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు కౌన్సెలింగుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ 45 కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి (అంటే ఈ నెల 13) వాయిదా వేసింది. సరైన సదుపాయాలు లేనికారణంగా రెండు నెలల కిందట తెలంగాణలోని 174 కళాశాలల అర్హతను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో వాదనలు వినిపించిన నలభై ఐదు కాలేజీల తరపు న్యాయవాదులు, ఆగస్టు 30లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు చెప్పినా వినలేదని, దీనివల్ల తాము పూర్తిగా నష్టపోయామని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో సోమవారంనాడు ఈ పిటిషన్ విచారణను సుప్రీం వేరే ధర్మాసనానికి బదిలీచేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News