: ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఎబొలా వైరస్ అంటించుకునేందుకు సిద్ధమవుతున్నారా?
ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న ఎబొలా వైరస్ ఇప్పుడు పాశ్చాత్య దేశాలను కూడా వణికిస్తోంది. ఈ వైరస్ సోకితే బతికే అవకాశాలు అత్యంత స్వల్పం కావడమే అందరి ఆందోళనకు కారణం. ఈ ప్రాణాంతక వైరస్ ను ఆయుధంగా చేసుకుని అగ్రరాజ్యాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ తెగించవచ్చని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ను అంటించుకున్న మిలిటెంట్లు శత్రు దేశాలకు చేరుకుని, అక్కడి ప్రజల్లో ఈ మహమ్మారి వైరస్ ను వ్యాప్తి చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని యూఎస్ నావల్ కళాశాల ప్రొఫెసర్ అల్ షిమ్ కూస్ అంటున్నారు. బకింగ్ హాం యూనివర్శిటీ సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇంటలిజెన్స్ విభాగం డైరక్టర్ ప్రొఫెసర్ ఆంథోనీ గ్లీస్ కూడా షిమ్ కూస్ తో ఏకీభవించారు. కిరాతక ఐఎస్ఐఎస్ ఫైటర్లు ఆత్మాహుతికి కూడా వెనుకాడబోరని, ఈ క్రమంలో వారు 'ఎబొలా' స్ట్రాటజీపై దృష్టి పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు.