: ఐరాస నుంచి భారత్ కు రావాల్సిన బకాయిలు రూ.671 కోట్లు!


ప్రపంచ దేశాల కూటమి ఐక్యరాజ్య సమితి మన దేశానికి అక్షరాల రూ.671 కోట్లు బాకీ పడింది. అదేంటీ, వివిధ కార్యక్రమాల కోసం మనమే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి అప్పులు తీసుకుంటాం కదా, మనం కూడా అప్పులిచ్చే స్థాయికి చేరామా? అని అనుకుంటున్నారా? మనమేమీ అప్పు ఇవ్వలేదు కాని ఐరాస నిర్దేశించిన విధిని నిర్వర్తించాం. అందుకు ఆ సంస్థ మనకు చెల్లించాల్సిన వేతనాలను చెల్లించలేదు, అదీ సంగతి! ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఐరాస శాంతి పరిరక్షక దళాలను నియోగిస్తోంది. శాంతి పరిరక్షక దళాల్లో మన పోలీసులు కూడా చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందేగా. రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన పోలీసు అధికారులు సురేంద్ర బాబు నుంచి ప్రవీణ్ కుమార్ దాకా ఐరాస శాంతి పరిరక్షక దళాల్లో పనిచేసి వచ్చిన విషయమూ మనకు తెలిసిందే. ఈ నెల 3 నాటికి ఈ కార్యకలాపాలతో పాటు ఆ సంస్థ నిర్వహించిన ఇతరత్రా వ్యాపకాల్లో మనం పాల్పంచుకున్నందుకు రూ.671 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందట. ఈ విషయాన్ని ఐరాస అండర్ సెక్రటరీ జనరల్ యుకియో తకసు స్వయంగా వెల్లడించారు. ఈ మొత్తాన్ని రెండు రోజుల్లోగా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. మనకే కాదండోయ్, ఈ తరహాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా లాంటి దేశాలకు కూడా ఐరాస బాకీ పడిందట.

  • Loading...

More Telugu News