: 'హాఫ్ గాళ్ ఫ్రెండ్' రాయడానికి స్ఫూర్తి అదే: చేతన్ భగత్


భారత్ లో యువత అమితంగా ఇష్టపడే రచయితల్లో చేతన్ భగత్ ప్రముఖుడు. ఆయన రాసిన 'వన్ నైట్ @ కాల్ సెంటర్', '2 స్టేట్స్', 'వాట్ యంగ్ ఇండియా వాంట్స్', 'ద 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్', 'రివల్యూషన్ 2020', 'ఫైవ్ పాయింట్ సమ్ వన్'... ఎంతో ప్రజాదరణ పొందాయి. చేతన్ రచనలు బాలీవుడ్ చిత్రాలుగానూ తెరకెక్కాయి. వాటిలో 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' నవల '3 ఇడియట్స్' గా రూపుదిద్దుకుంది. అది ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. చేతన్ భగత్ తాజా నవల 'హాఫ్ గాళ్ ఫ్రెండ్' ఆవిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ, ఆంగ్లం ఇప్పుడు భారత్ లో ఓ నూతన కుల వ్యవస్థలా మారిందని, ఓ వ్యక్తికి గాళ్ ఫ్రెండ్ ను, జాబ్ ను ఇంగ్లిషే డిసైడ్ చేస్తోందని పేర్కొన్నారు. ఆంగ్ల పరిజ్ఞానం లేని వ్యక్తి ఉద్యోగం సంపాదించుకోలేడని, ఇంగ్లిష్ సరిగా రాని వ్యక్తితో అమ్మాయిలు డేటింగ్ కు ముందుకు రారని అభిప్రాయపడ్డారు. ఈ అంశాల ఆధారంగానే 'హాఫ్ గాళ్ ఫ్రెండ్' నవల రాశానని చేతన్ భగత్ చెప్పారు. బీహార్ కు చెందిన గ్రామీణ యువకుడు ఢిల్లీలోని సంపన్న వర్గానికి చెందిన రియా అనే అందాలరాశితో ప్రేమలో పడతాడని... అదే తన నవల ఇతివృత్తమని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News