: ఏపీలో రుణమెంతైనా... 20 శాతం చొప్పునే చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఒకేసారికాదు, రెండుమూడు దశలుగా కాకుండా, మొత్తం ఐదువిడతల్లో బ్యాంకులకు చెల్లించుకుంటూ పోవాలని నిర్ణయించింది. అదీ రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.10వేల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఎంత ఉన్నా 20 శాతం చొప్పున చెల్లించాలని ఓ నిర్ణయానికి వచ్చింది. దీని ప్రకారం ఈ నెల 22న రైతు సాధికార సంస్థ తరపున బ్యాంకులకు తొలి విడతగా చెల్లించే 20 శాతం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. ఈ క్రమంలో రూ.20 వేల రుణభారం ఉన్న రైతు ఖాతాకు రూ.4 వేలు, రూ. 1.50 లక్షల రుణభారం ఉన్న రైతుకు రూ.30 వేలు వెళుతుందని అధికార వర్గాలు వివరించాయి. మిగతా రుణాన్ని నాలుగు విడతల్లో యేటా పదిశాతం వడ్డీచొప్పున తిరిగి చెల్లించనున్నారట.