: అల్లకల్లోలంగా మారిన సముద్రం
హుదూద్ తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతంలో గాలుల వేగం క్రమేణా పెరుగుతోంది. దీంతో, సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. కళింగపట్నం దగ్గర రెండు మీటర్ల మేర అలలు ఎగసిపడుతున్నాయి. 50 అడుగుల వరకు సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. విశాఖలో అలల ఉధ్ధృతి పెరిగింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుంటున్నారు. తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.