: కృష్ణాజిల్లా పెద్ద అవుటుపల్లి కాల్పుల నిందితులకు రిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా పెద్ద అవుటుపల్లి జాతీయ రహదారిపై హత్యల కేసులో నిందితులకు గన్నవరం మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈ ఉదయం పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా విచారణ జరిగింది. అనంతరం 24 తేదీ వరకు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. మొత్తం మూడు హత్యల కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను కొన్ని రోజుల కిందట పోలీసులు అరెస్టు చేశారు. నిన్న (గురువారం) ప్రత్యేక బస్సులో విజయవాడ కమిషనరేట్ కు తీసుకువచ్చారు.