: క్షమాపణలు కోరిన సత్య నాదెళ్ల


మహిళా ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్షమాపణలు కోరారు. ఉద్యోగాలు చేసే మహిళలు జీతాల పెంపు గురించి ఆలోచించకుండా... తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లాలని... పెరగాల్సిన జీతం అదే పెరుగుతుందని ఆరిజోనాలో జరిగిన ఓ కంప్యూటింగ్ సదస్సులో సత్య కామెంట్ చేశారు. మహిళలు తమ కెరీర్ లో దూసుకుపోతున్నప్పటికీ... జీతాల పెంపు విషయంలో మాత్రం అసంతృప్తికి లోనవుతున్నారని... ఇలా ఎందుకు జరుగుతోందని ఎదురైన ప్రశ్నకు సత్య పైవిధంగా స్పందించారు. తన సమాధానంలో కర్మ సిద్ధాంతాన్ని కూడా సత్య ఊటంకించారు. సత్కర్మలు చేస్తే ఆ పుణ్యం తిరిగి వస్తుందని ఆయన చెప్పారు. దీనిపై మహిళా లోకం మండిపడింది. దీంతో, సత్య తన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. వేతనాల తేడాలో లింగ వివక్ష తగ్గాలని అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ మహిళలకు ఇచ్చిన సలహాపై క్షమాపణలు చెప్పారు.

  • Loading...

More Telugu News