: ఇన్ఫోసిస్ నికరలాభం రూ. 3,096 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. అంచనాలకు మించి రూ. 3,096 కోట్ల నికరలాభాన్ని ఇన్ఫోసిస్ ఆర్జించింది. పోయిన ఏడాది ఇదే సమయంతో పోలిస్తే నికరలాభం 28.6 శాతం పెరిగింది. విశాల్ సిక్కా కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెలువడిన తొలి త్రైమాసిక ఫలితాలు ఇవి. దీనికితోడు, ఒక్కో షేరుకు 30 రూపాయల మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని ఇన్ఫీ బోర్డు నిర్ణయించడంతో... కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఎగబాకాయి.