: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం రూ. 2 లక్షలకు పెంపు?


తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ప్రజాప్రతినిధులకు లభిస్తున్న వేతనాలను రెట్టింపు చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం అలవెన్సులతో కలిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలకు రూ. 95 వేల వరకు వస్తోంది. మంత్రులకు రూ. 1.50 లక్షలు వస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే మంత్రులకు నెలకు రూ. 3 లక్షలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ. 2 లక్షల వేతనం అందుతుంది. జీతాన్ని పెంచితే పైరవీలు, కాంట్రాక్టులు చేసుకోకుండానే... తమకు అయ్యే ఖర్చులను తట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ప్రజాప్రతినిధులకు వీలు కలుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన.

  • Loading...

More Telugu News