: నరైన్ ను తప్పించడం వెనుక బలమైన శక్తులున్నాయా?


మిస్టరీ బౌలర్ గా ప్రఖ్యాతి గాంచిన విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ను జట్టు నుంచి తప్పించడం వెనుక క్రికెట్ లోని బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాలు వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్. చాలా ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న నరైన్ బౌలింగ్ శైలి మొదట్నుంచి అలాగే ఉందని... ఇప్పుడు అకస్మాత్తుగా అతను చకింగ్ చేస్తున్నట్టు ఎందుకు అనిపించిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్ కు ముందు వరుసగా రెండు మ్యాచ్ లలో నరైన్ బౌలింగ్ సరిగా లేదంటూ... ఫైనల్స్ ఆడకుండా అతడిని తప్పించారు. అనంతరం భారత్ లో వెస్టిండీస్ పర్యటనకు కూడా నరైన్ దూరమయ్యాడు. దీనిపై మాట్లాడుతూ, ప్రపంచ కప్ కు ముందు ఓ క్రికెటర్ పై ఇలాంటి చర్య తీసుకుంటే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని లాయిడ్ కామెంట్ చేశాడు. కేవలం క్రికెట్లోని బలమైన శక్తుల రాజకీయాలకే నరైన్ బలయ్యాడని రిచర్డ్స్ అన్నాడు.

  • Loading...

More Telugu News