: జబొంగ్ తో ఫ్లిప్ కార్ట్ కు అమెజాన్ చెక్ పెట్టేనా?


ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు చెక్ పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అమెజాన్. కామ్ పరిశీలిస్తోందట. అమెరికాకు చెందిన అమెజాన్.కామ్, ప్రపంచంలో శరవేగంగా విస్తరిస్తున్నా, భారత్ మార్కెట్ లో మాత్రం ఫ్లిప్ కార్ట్ ను ఢీకొట్టలేకపోతోంది. ఇటీవల భారత్ లో పర్యటించిన అమెజాన్ అధిపతి బెజోస్, భారత మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించడం కంటే, ఫ్లిప్ కార్ట్ ను ఎలా అధిగమించగలమన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారట. ఈ క్రమంలోనే ఇదే రంగంలోని మరో భారతీయ కంపెనీ జబొంగ్.కామ్ పై ఆయన దృష్టి పడింది. ఎలాగైనా జబొంగ్ ను కొనుగోలు చేసి, ఫ్లిప్ కార్ట్ ను అధిగమించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని మార్కెట్ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా జబొంగ్ కొనుగోలు కోసం తన సిబ్బందిని ఆయన రంగంలోకి దింపారు. జబొంగ్ కొనుగోలు కోసం రూ.3 వేల కోట్లను వెచ్చించేందుకు అమెజాన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే రూ.4,500 కోట్ల విలువ చేసే తమ సంస్థను అమెజాన్ ఆఫర్ చేసిన తక్కువ మొత్తానికి విక్రయించలేమని జబొంగ్ చెప్పిందట. ఈ నేపథ్యంలో అమెజాన్ ఆఫర్ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News