: ఆధార్ కార్డులను నమ్మలేం... కేంద్ర హోంశాఖ ఆందోళన
ఓ వైపు అన్ని పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానించాలన్న ప్రయత్నాలు జరుగుతుంటే... మరోవైపు ఆధార్ కార్డులను పూర్తిగా నమ్మలేమని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డుల్లో ఉన్న సమాచారం అంతా నిజమని కాని, ప్రామాణికమని కాని నమ్మలేమని స్పష్టం చేసింది. ఆన్ లైన్ వెరిఫికేషన్ వ్యవస్థలో ఆధార్ కార్డులోని చిరునామాను ఉపయోగించాలన్న టెంలికాం శాఖ ప్రతిపాదనలపై హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. విశిష్ట గుర్తింపు కల్పించే విషయంలో ఆధార్ పక్కాగా ఉన్నప్పటికీ... అందులోని సమాచారాన్ని మాత్రం పూర్తిగా నమ్మలేమని కుండబద్దలు కొట్టింది. దేశంలో ఉంటున్న విదేశీయులు కూడా ఆధార్ కార్డు పొందే ప్రమాదం ఉందని... ఆధార్ ను ప్రామాణికంగా తీసుకుంటే, పొరుగు దేశస్తులు తమ ఏజంట్లను మన దేశంలోకి జొప్పించడానికి ఆధార్ పత్రాలు పొందే అవకాశం ఉందని తెలిపింది.