: ‘గాలి’ రెడ్డి గారు... స్వేచ్ఛగానే విహరిస్తున్నారట!


కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి, జైల్లో ఉన్నా, స్వేచ్ఛగానే విహరిస్తున్నారట. రెడ్డి గారు... అంటూ సెంట్రల్ జైలు సిబ్బంది చేత పిలిపిించుకుంటున్న జనార్ధన్ రెడ్డి, అనారోగ్య కారణాలని చెప్పి, నెలకు ఐదారు రోజుల పాటు ఖరీదైన కార్పోరేట్ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాల మధ్య సేదదీరుతున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనం రాసింది. జైలు నుంచి మహీంద్ర బొలెరో వాహనంలో బయలుదేరే జనార్థన్ రెడ్డి, మార్గమధ్యంలో తన కోసమే సకల హంగులతో తీర్చిదిద్దిన పజేరో వాహనంలోకి మారుతున్నారు. అంతేకాదు, తన అనుంగు శిష్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి శ్రీరాములుతో కలసి సదరు కారులో విహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఆయనతో ఆస్పత్రిలో ఉంటున్నారు. ఇక ఆస్పత్రి ఖర్చులను ఎవరు భరిస్తున్నారన్న విషయం అంతుబట్టడం లేదు. అసలు అన్నేసి రోజులు కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునేందుకు జనారన్థన్ రెడ్డికి వచ్చిన రోగాలేమిటో తెలుసా? ఛాతీ నొప్పి, వీపు నొప్పి, ఎముక సంబంధింత సమస్యలేనట! బెయిల్ పిటిషన్ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా పలుమార్లు చక్కర్లు కొట్టినా ఫలితం లేకపోవడంతో జనార్థన్ రెడ్డి, ఈ మార్గాన్ని ఎంచుకున్నారని ఆ కథనం వెల్లడించింది.

  • Loading...

More Telugu News