: ఐఎస్ఐఎస్ పై విమాన దాడులు జరిపిన ఆస్ట్రేలియా
ఇరాక్ లో ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులపై దాడులు చేస్తున్న అమెరికాకు ఆస్ట్రేలియా జతకలిసింది. తమ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి, సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగి వచ్చిందని ఆస్ట్రేలియా సైనిక ప్రతినిధి తెలిపారు. ఐఎస్ఐస్ పై దాడులు చేయడమే కాకుండా... ఇరాకీ దళాలకు శిక్షణ, సలహాలు కూడా ఇస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. దీనికోసం, ఓ దళాన్ని ఇరాక్ పంపుతామని తెలిపింది.