: ‘మహా’ పోరులో బీజేపీ ఒంటరిగానే విజయం సాధిస్తుందట!


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ, ఏ ఒక్కరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందట. ‘ద వీక్’ పత్రిక సౌజన్యంతో హన్సా రీసెర్చి చేపట్టిన సర్వేలో బీజేపీ, మొత్తం 288 స్థానాల్లో 154 స్థానాలను కైవసం చేసుకుంటుందని తేలింది. అయితే ముఖ్యమంత్రి రేసులో మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు. తాజా మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, ముఖ్యమంత్రి రేసులో రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. 36.50 శాతం ఓట్లతో బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో కూర్చోనుంది. శివసేనకు 17.10 శాతం, కాంగ్రెస్ కు 11.97 శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే తేల్చింది. మొన్నటిదాకా అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 25 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 5.85 శాతం ఓట్లతో కేవలం 17 సీట్లు దక్కే అవకాశాలున్నాయని తేలింది. ఇక సీఎం రేసులో పవార్ ఐదో స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News