: విమర్శలు చేస్తూ మన శక్తిని తక్కువ చేస్తున్నారు: మోడీ
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడాన్ని భారత జావాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారని ప్రధాని మోడీ తెలిపారు. బారామతిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దుల్లో పరిస్థితులపై విమర్శలు గుప్పించి భారత జవాన్ల కృషిని నీరుగార్చవద్దని ఆయన సూచించారు. గతంలోలా పాక్ చర్యలను సహించబోమని శత్రువులు ఇప్పటికే గ్రహించి ఉంటారని మోడీ పేర్కొన్నారు.