: ఇన్ స్టాగ్రాంకే యూత్ ఓటు!


సెల్ఫీల యుగం ప్రారంభమయ్యాక సోషల్ వెబ్ సైట్లలోనే యువత అత్యధిక సమయం వెచ్చిస్తున్నారు. దీంతో వారి ఇష్టాయిష్టాలపై పైపర్ జాఫ్రే అనే సంస్థ సర్వే చేసింది. అందులో ఎక్కువ మంది ఇన్ స్టాగ్రాంకే మద్దతు పలికారు. ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసిన ఫోటోలు ఎవరు పడితే వారు సేవ్ చేసేందుకు, కాపీ చేసేందుకు వీలు కాకపోవడంతో ఎక్కువ మంది ఇన్ స్టాగ్రాంను వినియోగించేందుకు ఓటు వేస్తున్నారు. దీంతో సర్వేలో ఫస్ట్ ప్లేస్ ఇన్ స్టాగ్రాంకే ఇచ్చారు. 76 శాతం మంది టీనేజర్లు ఇన్ స్టాగ్రాం వినియోగిస్తున్నట్టు సర్వే స్పష్టం చేసింది. గత ఆరు నెలల్లో 7 శాతం ఇన్ స్టాగ్రాం వినియోగదారులు పెరిగినట్టు తెలిపింది. 59 శాతం మంది వినియోగదారులతో ట్విట్టర్ ద్వితీయ స్థానంలో నిలిచిందని సర్వే వివరించింది. 49 శాతం వాడకందారులతో ఫేస్ బుక్ మూడో స్థానంలో ఉందని సర్వే స్పష్టం చేసింది. పిన్ ట్రెస్ట్, తంబ్లర్ సోషల్ నెట్ వర్క్ లు ఒక్కోటి 20 శాతం వినియోగంతో తరువాత స్థానాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News