: బావకు నేను చేసే చివరి ఉత్సవం ఇదే!: శ్రీహరి భార్య
"మా బావ (శ్రీహరి)కు నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలను మా పిల్లలు కొనసాగిస్తారు. పిల్లలు చదువుకుని మంచి స్థానాల్లో ఉండాలని నేను ఆశపడ్డాను. కాని వాళ్లు సినిమాల్లో స్థిరపడాలని బావ కోరుకున్నారు. వాళ్లు కూడా బావ కోరికను నెరవేర్చాలని అనుకుంటున్నారు" అని వెటరన్ సినీ నటి, దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి తెలిపారు. హైదరాబాదులో శ్రీహరి ప్రధమ వర్థంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సినీపరిశ్రమలోనూ, మీడియాతోనూ తమకు మొదటి నుంచీ మంచి సంబంధాలే ఉన్నాయని అన్నారు. ఇకపై కూడా అవే సంబంధాలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు. శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ మాట్లాడుతూ, తన తమ్ముడ్ని హీరోగా చేయాలని భావిస్తున్నామని, తాను డైరెక్టర్ గా మారేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.