: వైరా ఎమ్మెల్యేపై అనర్హత చర్యలు తీసుకోండి... స్పీకర్ ను కోరిన వైసీపీ


కొన్ని రోజుల కిందట టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. తమ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన మదన్ లాలాపై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన స్పీకర్, అన్ని విషయాలు పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వైసీపీ నేతలు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News