: సుప్రీంకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 29న కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.