: తీగల కృష్ణారెడ్డి పదవి.. కృష్ణయాదవ్ కు, తలసాని పదవి కూన వెంకటేష్ గౌడ్ కు!
టీడీపీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమవడంతో చంద్రబాబు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో పడ్డారు. తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం టీడీపీ హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో, మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ ను అధ్యక్షుడిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. అలాగే, తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. ఆయన పదవిని కూన వెంకటేష్ గౌడ్ కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం.