: టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదు: చంద్రబాబు
టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీకి బలం కార్యకర్తలని, నేతలు స్వార్ధంతో పార్టీలు మారినా కేడర్ నిస్వార్థంగా ఉంటారని అన్నారు. పార్టీలోని నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది సాధారణమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది కనుక తమ నేతలను ప్రలోభపెట్టి, ఇబ్బంది పెట్టి పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్నారని, పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో తనకు తెలుసని ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రజలకు చెబితే ఎవరేంటో తెలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.