: ప్రధాని మోడీతో రేపు ఫేస్ బుక్ సీఈవో భేటీ
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నారు. భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు న్యూడిల్లీలో జరిగిన తొలి ఇంటర్నెట్.ఓఆర్ జీ సదస్సులో జుకెర్ పాల్గొని ప్రసంగించారు. భారత్ లో ఒక బిలియన్ కు పైగా ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదన్నారు. రేపు తాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భారతదేశంలోని గ్రామాలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఎలా పొందవచ్చనే అంశంపై ఆయనతో చర్చిస్తానని జుకెర్ వెల్లడించారు.