: విద్యుత్ శాఖను మనకు అప్పగించమనండి... కరెంట్ తెచ్చి చూపిద్దాం!: టీ టీడీపీ నేతలతో బాబు


సచివాలయంలో టీటీడీపీ నేతలతో చంద్రబాబు అత్యవసర భేటీ ముగిసింది. ఈ సమావేశంలో, చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఎలాగైనా, రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభమయ్యే బస్సు యాత్రను విజయవంతంగా నిర్వహించాలని టీటీడీపీ ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారని తెలుస్తోంది. బస్సు యాత్ర సందర్భంగా విద్యుత్ శాఖను టీడీపీకి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని చాలెంజ్ చేయాల్సిందిగా చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. ఆ శాఖను తనకు అప్పగిస్తే తెలంగాణకు విద్యుత్ ను తీసుకొచ్చి చూపిస్తానని ఆయన అన్నట్టు తెలుస్తోంది. తాను ఆంధ్రప్రదేశ్ కు నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం అనేక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నానని, కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లోటు ఉన్నప్పటికీ ఎలాంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోలేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. స్వార్థపరులే టీడీపీని వీడుతున్నారని చంద్రబాబు ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News