: లోకేష్ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరిస్తున్నారు: ఎల్.రమణ


టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలి, టీడీపీ ఎమ్మేల్యేలను టీఆర్ఎస్ లోకి ఆకర్షించే పనిలో పడిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పై తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ టీడీపీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా మాత్రమే ఆయన పనిచేస్తున్నారని వెల్లడించారు. లోకేష్ ను తప్పుపడితే టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News