: 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ ను గుర్తించిన ప్రధాన సాక్షులు


'హిట్ అండ్ రన్' కేసులో నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన నాటి ఘటనకు ముందు మారియట్ హోటల్ నుంచి బయటికి వచ్చాక డ్రైవర్ సీటులో సల్మాన్ ఉన్నట్లు ప్రధాన సాక్షులు ముంబయి సెషన్స్ కోర్టు విచారణ సమయంలో చెప్పినట్లు సమాచారం. ఎప్పుడైతే సల్మాన్ కారు బేకరీ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిందో అప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడని, నలుగురు గాయపడ్డారని హోటల్ లో పార్కింగ్ సహాయకుడు ధృవీకరించాడు. ఇదే కేసులో సాక్ష్యం చెప్పిన లిక్కర్ బార్ మేనేజర్, ప్రమాదానికి ముందు తన స్నేహితులతో కలసి సల్మాన్ రెస్టారెంటుకు వచ్చాడని, అయితే అప్పటికే తాగి వున్నాడా? లేదా? అనేది మాత్రం తనకు తెలియదని చెప్పాడు. ఇదే విషయాన్ని చెప్పిన బార్ వెయిటర్... సల్మాన్ తాగింది లేనిదీ గుర్తించలేదన్నాడు.

  • Loading...

More Telugu News