: కొమరం భీమ్ మ్యూజియంకు నిధులు మంజూరు
ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమరం భీమ్ పేరిట ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో ఏర్పాటు చేయనున్న స్మారక గిరిజన మ్యూజియంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇటీవల చనిపోయిన ఆంధ్రా రచయిత (తెలంగాణా ఉద్యమాన్ని సమర్ధించిన వ్యక్తి) పైడి తేరేష్ బాబు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం విడుదల చేసినట్లు కూడా ఉత్తర్వులు ఇచ్చింది.