: రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రమాల్లో బాబు పాల్గొంటారని వివరించారు. ఇంకా పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని చెప్పారు.