: ఏపీ పోలీసులకు 100 కోట్లతో 3,200 ఆధునిక వాహనాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో భద్రత, పెట్రోలింగ్, ఇతర అవసరాల కోసం సుమారు 300 ఇన్నోవా వాహనాలను ఇటీవలే కొనుగోలు చేసింది. ఇదే బాటలో , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలో ఏపీ పోలీస్ కు నూతన వాహనాలను సమకూర్చనుంది. పోలీసులకు వాహనాల కొరత తీర్చాలని డీజీపీ రాముడు ఇటీవల పట్టుబట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లను మంజూరు చేసింది. ఈ మొత్తంతో, 3200 వాహనాలను ఏపీ పోలీస్ శాఖ కొనుగోలు చేయనుంది. వీటిలో, ఉన్నతాధికారుల కోసం 150 ఇన్నోవా వాహనాలను కొనుగోలు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ల అవసరాలకు మరో 900 టాటా సుమోలను ఖరీదు చేస్తారు. అలాగే, గస్తీ నిర్వహణకు మరో 150, జాతీయ రహదారులపై పెట్రోలింగ్ కు 50 వాహనాలను కేటాయించారు. దీంతో పాటు, ఏపీలోని ప్రతీ పోలీస్ స్టేషన్ కు రెండు ద్విచక్ర వాహనాలను సమకూర్చనున్నారు.