: చంద్రబాబుతో టీ టీడీపీ నేతల భేటీ


సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ సహా పలువురు కీలక నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు నగరంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తీగల కృష్ణారెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుండటంతో పార్టీలో కలవరం మొదలైంది. నిన్నటిదాకా పార్టీని వీడిన నేతలపై విమర్శలు గుప్పించిన టీడీపీ, తాజాగా నోరు మెదిపేందుకే వెనుకాడుతోంది. తలసాని బృందం పార్టీని వీడటం ఆ పార్టీ తెలంగాణలో చేపట్టనున్న యాత్రలపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపనుందని విశ్లేషణలు సాగుతున్నాయి. పార్టీలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు, టీటీడీపీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News